రెండు విద్యాసంస్థల(Educational Institutions)కు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమిటీ, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ సంస్థలు ఇక విశ్వవిద్యాలయాలుగా మారతాయని ప్రకటించింది. ఈ రెండింట్లో తెలంగాణ విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని ఆదేశించింది. సాధారణ యూనివర్సిటీల్లా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఉండేలా బోధన ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.