జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిత్ దోవల్.. అంతర్జాతీయ మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ తో ఎక్కడైనా చిన్న అద్దం పగిలిందా, అలా జరిగితే ఒక్క ఫొటో చూపించండని సవాల్ చేశారు. IIT మద్రాస్ 62వ స్నాతకోత్సవానికి హాజరైన దోవల్.. న్యూయార్క్ టైమ్స్ రాసిన వార్తకు స్పందించారు. ఇంకా ఏమన్నారంటే… ‘మేం స్వదేశీ టెక్నాలజీ తయారు చేశాం.. ఆపరేషన్ సిందూర్ లో వాడిందంతా మా దేశానిదే.. భారత టెక్నాలజీని చూసి గర్వపడుతున్నా.. మేం ధ్వంసం చేసిన 9 టెర్రరిస్టు క్యాంపులు సరిహద్దుల్లో లేవు.. పాక్ నడిబొడ్డున ఉన్నవాటిని ఎక్కడా మిస్సవ్వలేదు.. 23 నిమిషాల్లోనే అన్నింటినీ టార్గెట్ చేశాం.. మా సైడ్ నుంచి ఎక్కడైనా నష్టం జరిగిందేమో ఒక్క ఫొటో చూపించండి..’ అంటూ ఛాలెంజ్ చేశారు. https://justpostnews.com