
ఆసియా మెన్స్ ఎమర్జింగ్ కప్ సెమీఫైనల్ లో భారత్(India) ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన సెమీఫైనల్(semi final) లో 51 రన్స్ తేడాతో గెలుపొంది ఫైనల్ లో అడుగుపెట్టింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ యశ్ ధుల్(66) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సాయి సుదర్శన్(21), అభిషేక్ శర్మ(34), మనవ్ సుతార్(21) మినహా అంతా తక్కువ స్కోరుకే ఔటయ్యారు.
212 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 34.2 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌట్ అయింది. నిషాంత్ సంధు(5/20) కీలక వికెట్లతో బంగ్లా వెన్నువిరిచాడు. మనవ్ సుతార్ 3, అభిషేక్ 1, దొడియా 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు. యశ్ ధుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. ఆదివారం ఫైనల్లో భారత్… కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్ తో తలపడుతుంది.