ఒక పూట తిండి లేకున్నా ఉంటారేమో గానీ మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. అంతలా దేశంలో 120 కోట్ల మంది వద్ద ఫోన్లున్నాయి. ఇందులో 60 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం మార్కెటైన భారత్ లో రీఛార్జ్ ప్లాన్లు మళ్లీ పెరగబోతున్నాయట. 2024 జులైలో 11% నుంచి 23 శాతానికి పెరిగితే, ఈ ఏడాది చివరి నాటికి మళ్లీ వడ్డింపు తప్పేలా లేదు. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU)లు పెంచుకోవడానికి టెలికాం కంపెనీలు ఛార్జీలు మోపుతున్నాయి. https://justpostnews.com
ఒక్కో యూజర్ నుంచి నెలకు కనీసం రూ.300 రాబట్టేలా గతేడాది టారిఫ్ లు పెంచాయి. 3 నెలలకు రూ.399 గల ప్లాన్ లు రూ.800-1000కి చేరాయి. 2025 చివరి నాటికి మరో 10-12% పెరుగుతాయన్న అంచనాలున్నాయి. ఇంతకుముందు రూ.149 ఉన్న ప్లాన్ ప్రస్తుతం 299 అయింది. జియో, ఎయిర్ టెల్ వంటి పలు కంపెనీల భారం తట్టుకోలేక కోటిన్నర మంది యూజర్లు BSNLకు మారిపోయారు.