కల్తీ కల్లు మృతుల కేసులో అధికారులపై వేటు పడింది. కూకట్ పల్లి షాపుల వల్ల ఆరుగురు మృతిచెందగా, బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ సస్పెండయ్యారు. DTFతోపాటు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(AES) ప్రమేయంపైనా దర్యాప్తు నడుస్తోంది. అల్ఫ్రాజోలం కలిపిన కల్లు తాగి హైదరాబాద్ లో ఐదుగురు, నాగర్ కర్నూల్ వెళ్లి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా 51 మందికి నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. హైదర్ నగర్, HMT కాలనీ, సర్దార్ పటేల్ నగర్, భాగ్యనగర్ షాపుల్లోని కల్లును నారాయణగూడలోని అబ్కారీ ల్యాబ్ లో పరీక్షించారు. ఇప్పటికే నలుగురు షాప్ ఓనర్లను అధికారులు అరెస్టు చేశారు.