జీవితం ఒక మాయాలోకం లాంటిదని టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ నిర్వేదం చెందాడు. ‘జీవితం అనూహ్యం, ఊహించలేనిది.. మనం కొన్నింటి కోసం ఎంతో పోరాడతాం.. కానీ రేపు ఏమవుతుందనేది తెలియదు.. జీవితానికి గ్యారంటీ లేదు.. ఇది నాకు పెద్ద షాక్..’ అన్న ఆవేదన వెనుక కారణముంది. పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ డియాగో జోటా(28) జులై 3న కారు యాక్సిడెంట్లో మృతిచెందాడు. 2024-25లో లివర్ పూల్ ప్రీమియర్ లీగ్ ఆడిన అతడు సిరాజ్ కు ఫేవరెట్. ఇంగ్లండ్ ఆటగాణ్ని ఔట్ చేసిన టైంలో డియాగోకు నివాళి అర్పించిన సిరాజ్.. అలా నిర్వేదంగా మాట్లాడాడు. https://justpostnews.com