భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకునే భక్తులతో శ్రీశైలం(Srisailam) కిటకిటలాడుతోంది. పాతాళగంగ, సున్నిపెంట, దోమలపెంట(Domalapenta) మధ్య 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వారాంతం కావడంతో దర్శనాలతోపాటు శ్రీశైలం డ్యాం గేట్ల నుంచి విడుదలవుతున్న నీటి పరవళ్లను చూసేందుకు భారీగా వచ్చారు. భక్తులు, పర్యాటకుల వందలాది వాహనాలతో నల్లమల అటవీ ప్రాంతం సందడిగా మారింది.