చాలా ఏళ్ల తర్వాత ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చేసినా.. వర్షాలు(Rains) మాత్రం లేవు. ఎండలు మండే మే నెలలో వానలు పడితే, ఈ సీజన్లో ఎండలు కొడుతున్నాయి. ఇప్పటికే సమృద్ధిగా కురవాల్సి ఉన్నా చినుకు జాడే కనపడటం లేదు. ఈరోజు(జులై 12) నుంచి ఈనెల 18 వరకు పరిస్థితిని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేటి నుంచి రేపు పొద్దున వరకు మోస్తరు వర్షాలుంటాయని తెలిపింది. కానీ ఆ తర్వాత వారం పాటు జల్లులు కష్టమేనని అంచనా వేసింది. ఈలోపు ఏమైనా పరిస్థితులు మారతాయేమో చూడాలి. కానీ రైతులు మాత్రం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. https://justpostnews.com