అదో దట్టమైన అడవి.. టూరిస్టులు వెళ్లాలంటేనే సెక్యూరిటీ ఉండాలి. భయానక ప్రాంతంలోని గుహ(Cave)లో ఇద్దరు పిల్లలతో కనిపించింది రష్యా మహిళ. గోవా మీదుగా కర్ణాటకలోని గోకర్ణ(Gokarna) చేరుకున్న నీనా కుటిన(40), ప్రేమ(6), అమా(4).. అత్యంత భీకరంగా, కొండచరియలు విరిగిపడే రామతీర్థ కొండల్లో ఉన్నారు. ఈ కొండల్లోనే 2024లో భారీ ప్రమాదం జరిగింది. విషపూరిత పాములు, వన్యమృగాలు తిరిగే చోట ఉండటం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. నగర జీవనానికి దూరంగా, హిందూ సంస్కృతి నచ్చి ప్రశాంతత కోసమే దట్టమైన గుహలో ధ్యానం చేస్తున్నట్లు తెలిపారు. ఆమె కోరిక మేరకు కుమ్టా తాలూకాలోని 80 ఏళ్ల స్వామీజీ యోగరత్న సరస్వతి ఆశ్రమానికి తరలించారు. వీసా, పాస్ పోర్ట్ వివరాలు తెలిపినా అవి ఎక్కడో పోయాయని చెప్పింది.