ఓపెనర్ కేఎల్ రాహుల్(Rahul) సెంచరీతో ఇంగ్లండ్ కు దీటైన జవాబిస్తోంది టీమ్ఇండియా. తొలి టెస్టులో సెంచరీ(137) చేసిన రాహుల్.. ఈ మూడో టెస్టులోనూ శతకం(Hundred) పూర్తి చేశాడు. మరో ఎండ్ లో పంత్ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ దాటాడు. 107కు 3 వికెట్లు పడ్డ జట్టుకు ఈ జోడీ 141 పరుగుల భాగస్వామ్యం అందించింది. రాహుల్ సెంచరీ కోసం స్ట్రైక్ ఇచ్చేందుకు 248 స్కోరు వద్ద అనవసర సింగిల్ తీసిన పంత్.. స్టోక్స్ విసిరిన త్రోకు రనౌటయ్యాడు.