నీట్ యూజీ(NEET UG) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పూర్తి వివరాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(MCC) ప్రకటించింది. డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లోని MBBS, BDS, BSC నర్సింగ్ కోర్సుల ఆల్ఇండియా కోటాకు జులై 21న అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నాలుగు రౌండ్లలో భాగంగా 1, 2, 3తోపాటు చివరి ఆన్లైన్ స్ట్రే వెకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది. ప్రక్రియ సకాలంలో పూర్తయ్యేందుకు శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవు దినాల్ని సైతం సాధారణ పనిరోజులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. జూన్ 14న జరిగిన పరీక్షను 22.09 లక్షల మంది రాస్తే, 12.36 లక్షల మంది పాసయ్యారు. పూర్తి వివరాలకు mcc.nic.in ను సంప్రదించవచ్చు. https://justpostnews.com