ఇంగ్లండ్ గడ్డపై చెలరేగుతున్న రిషభ్ పంత్(Pant).. రికార్డులు సృష్టిస్తున్నాడు. 5 మ్యాచుల టెస్టు సిరీస్ లో ఇప్పటికే 416 రన్స్ చేసిన అతడు.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 74కు ఔటయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్ లో 400 పరుగులు దాటిన తొలి విదేశీ కీపర్ గా నిలిచాడు. 2014లో ధోని నెలకొల్పిన 349 పరుగులే ఇప్పటివరకు రికార్డ్. అత్యధిక సిక్సుల్లోనూ రోహిత్ తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. 67 టెస్టుల్లో రోహిత్ 88 సిక్సులు బాదితే, పంత్ 46 టెస్టుల్లోనే ఆ ఘనత సాధించాడు. సెహ్వాగ్(90 సిక్సులు)ను సైతం ఈ సిరీస్ లోనే దాటే ఛాన్స్ ఉంది. ఇక ఇంగ్లిష్ జట్టుపై అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్ కూడా అతడే. పంత్ 35, వివ్ రిచర్డ్స్ 34, టిమ్ సౌథీ 30, జైస్వాల్ 27, గిల్ 26.. టాప్-5లో ఉన్నారు.