45 క్రూడాయిల్(Crude Oil) వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ రైలు.. భారీ ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని ఎగత్తూర్ వద్ద అగ్నికి ఆహుతైన ట్యాంకర్ల నుంచి పెద్దయెత్తున మంటలు, పొగలు వచ్చాయి. దీంతో చెన్నై-అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గూడ్స్ ఎన్నోర్(Ennore) నుంచి ముంబయి వెళ్లాల్సి ఉంది. ఒక ట్యాంకర్ నుంచి వచ్చిన మంటలు మిగతా వాటికి అంటుకోవడంతో తీవ్రత ఎక్కువైంది. ఎంతమంది ప్రమాదంలో చిక్కుకున్నారో తెలియరాలేదు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com