ముంబయి దాడులకు పాల్పడ్డ కసబ్ కేసులో వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్(Ujjwal Nikam)కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనతోపాటు కేరళ టీచర్ సి.సదానందన్, చరిత్రకారిణి మీనాక్షి జైన్, విదేశాంగ మాజీ కార్యదర్శి శ్రింగ్లా.. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 12 MP స్థానాలు ఖాళీ కానుండగా, ప్రస్తుతానికి అందులో నలుగురి పదవీకాలం పూర్తయింది. US, బంగ్లా, థాయిలాండ్ లో రాయబారిగా, 2023 G-20 కో-ఆర్డినేటర్ గా శ్రింగ్లా పనిచేశారు. అనేక క్రిమినల్ కేసులు వాదించిన నికమ్.. 2024లో ముంబయి నార్త్ సెంట్రల్ స్థానంలో BJP నుంచి లోక్ సభకు పోటీ చేశారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో BJP నుంచి పోటీ చేసిన సదానందన్.. CPM కేడర్ తో జరిగిన హింసలో రెండు కాళ్లు కోల్పోయారు. ఢిల్లీ జార్జి కాలేజీలో మీనాక్షి జైన్ పనిచేస్తున్నారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com