మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల(Governors)ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. హరియాణా, గోవా, లద్దాఖ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా.. ఆషిమ్ కుమార్ ఘోష్ హరియాణా.. కవీందర్ గుప్తా(Kavinder Gupta) లద్దాఖ్ గవర్నర్లుగా నియమితులయ్యారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న రిటైర్డ్ బ్రిగేడియర్ డా.బి.డి.మిశ్రా రాజీనామాను ద్రౌపది ముర్ము ఆమోదించారు. https://justpostnews.com