హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. మే నెలలో సుప్రీం కొలీజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ఆమోదించారు. త్రిపుర హైకోర్టు CJగా ఉంటూ తెలంగాణకు బదిలీ అయ్యారు. 1965 జులై 7న జన్మించిన జస్టిస్ ఆపరేశ్.. ఢిల్లీ యూనివర్సిటీలో LLB పూర్తి చేశారు. 1990లో పట్నాలో అడ్వకేట్ గా నమోదై 2000 వరకు పనిచేశారు. 2001-2012 వరకు జార్ఖండ్ హైకోర్టులో పనిచేస్తూ ఆ ఏడాది జనవరి 24న అక్కడే అదనపు న్యాయమూర్తి అయ్యారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర CJగా బాధ్యతలు తీసుకున్నారు. 5 హైకోర్టులకు కొత్త CJలు రాగా, నలుగురు చీఫ్ జస్టిస్ లు బదిలీ అయ్యారు. మరిన్న వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com