యెమెన్(Yemen)లో ఉరిశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిషప్రియ(Nimisha Priya) కేసులో ముందడుగు పడింది. రేపు శిక్ష అమలవ్వాల్సి ఉండగా, అక్కడి ప్రభుత్వం 24 గంటలు వాయిదా వేసింది. భారత విదేశాంగ శాఖ జరుపుతున్న సంప్రదింపులతో ఫలితం కనిపించింది. తనను వేధించిన యెమెన్ వాసుణ్ని నిమిషప్రియ హత్య చేసింది. అక్కడి చట్టాల ప్రకారం హత్యకు గురైన కుటుంబం ఆమోదిస్తే తప్ప శిక్ష నుంచి ఊరట దక్కదు. 10 మిలియన్ డాలర్ల(రూ.8.5 కోట్ల)ను బాధిత ఫ్యామిలీకి ఆఫర్ చేశారు. అయినా ఒప్పుకోకపోవడంతో ఉరి తీసే ప్రక్రియ మొదలైంది. కానీ కేంద్రం చొరవ తీసుకుని దీనిపై మంతనాలు సాగిస్తోంది.