ఛాయ్ తాగినా, వస్తువు కొన్నా క్యాష్ కు బదులు డిజిటల్(Digital) పేమెంట్లకు అలవాటు పడ్డాం. ఈ UPI పేమెంట్లే ఇప్పుడు భయపెడుతున్నాయి. బెంగళూరు చిరు వ్యాపారులు UPI పేమెంట్లు తీసుకోవట్లేదు. వేలాదిమందికి GST నోటీసులు రావడంతో.. ఏ షాప్ చూసినా ‘నో యూపీఐ’ బోర్డులే కనిపిస్తున్నాయి. ఏటా రూ.40 లక్షలు దాటితే GST రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రూ.20 లక్షలు దాటినా GST పరిధిలోకి వస్తారు. టాక్స్ పరిధిలో 14 వేల మందిని గుర్తించిన అధికారులు.. 5,500 మందికి నోటీసులిచ్చారు. దీంతో UPIలు, QR కోడ్ లు కనపడకుండా చేస్తున్నారు. 2021-22 నుంచి వ్యాపారులపై అధికారుల నిఘా కొనసాగుతోంది. దాడులు జరుగుతాయన్న భయంతో QR కోడ్ లు తీసివేయడం, కొట్టేవేయడం చేస్తున్నారు.