టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) తమ ఉద్యోగులకు భారీ ప్రోత్సాహక చెల్లింపులు చేసింది. 70% మందికి 100 శాతం ‘వేరియెబుల్ పే’ ఇచ్చింది. లక్ష్యాల్ని చేరుకున్న సందర్భంలో బోనస్, కమిషన్ లేదా ప్రోత్సాహక చెల్లింపుగా ‘వేరియెబుల్ పే’ ఇస్తుంటారు. జూన్ తో ముగిసిన రెండో క్వార్టర్ కు దీన్ని ఇస్తున్నట్లు సిబ్బందికి మెయిల్స్ పంపించింది. వార్షిక వేతన(Annual Wages) పెంపు ఇంకా పెండింగ్ లోనే ఉంది. TCSలో ‘Y ట్రెయినీల’ నుంచి లెవెల్స్ ప్రారంభమై.. సిస్టమ్స్ ఇంజినీర్లు C1గా, ఆ తర్వాత C2, C3 – A&B, C4, C5 సహా CXO దశలతో ఉంటాయి. పై నుంచి C2 దశ దాకా ఉద్యోగులకు 100% ‘వేరియెబుల్ పే’ అందించింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com