ఇప్పటికే వరదలతో అల్లాడుతూ భారీ భూకంపానికి గురైన అమెరికా.. మెగా సునామీ వార్నింగ్ తో అప్రమత్తమైంది. అలస్కా(Alaska) తీరంలో రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రభావం దక్షిణ తీరంలో 700 మైళ్ల వరకు ఉందని జియోలాజికల్ సర్వే(USGS) తెలిపింది. 1958లో లిటుయా బేలో ఒక భారీ అల మైలు దూరం దూసుకుపోయి అడవిని తుడిచిపెట్టి భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. మెగా సునామీలు కేవలం టెక్టోనిక్ ప్లేట్ల చీలికల్నే కాదు, అపారమైన అలల్ని సృష్టించగలవన్నది USGS అంచనా. నాసా లెక్కల ప్రకారం 1958 నాటి సునామీ మళ్లీ రావొచ్చని, 25 ఏళ్లకోసారి ఇలాంటివి జరుగుతాయని తెలిపింది. అలస్కా ప్రాంతంలో 2020 నుంచి 7+ తీవ్రతతో ఎన్నో భూకంపాలు వచ్చాయి. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com