ఇప్పటిదాకా విమానాశ్రయాలు(Airports), ప్రభుత్వ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ ఇప్పుడు బడులను కూడా దుండగులు వదలట్లేదు. ఢిల్లీ, బెంగళూరులో 100 స్కూళ్లకు పైగా బెదిరింపులు వచ్చాయి. గత మూడు రోజులుగా దేశ రాజధానిలోని విద్యాలయాలకు వస్తున్న ఈ-మెయిల్ బెదిరింపులతో 60 చోట్ల పోలీసులు తనిఖీలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లోని 40 స్కూళ్లు సైతం బెదిరింపు బారిన పడ్డాయి. దీంతో పోలీసు టీముల్ని రంగంలోకి దింపి అణువణువు గాలిస్తున్నారు. ఆ ఈ-మెయిళ్లు పంపిన వారి వేటలో పడ్డారు పోలీసులు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com