CM సీటుకు ఎవరు ఎసరు పెడతారోనన్న భయంతో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయడం లేదా అంటూ రేవంత్ పై KTR సంచలన ఆరోపణలు చేశారు. ‘చెబుతావా మీ మనవడి మీద ఒట్టేసి, చెబుతావా బయటకొచ్చి.. నేనీళ్ల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని.. రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్న మాట వాస్తవం కాదా.. చెప్తావా లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా.. బయటికొచ్చి దమ్ముంటే ఒట్టేసి చెప్పు.. ఇంకోసారి ఢిల్లీ వెళ్తే 50 సార్లు పోయినట్లయితది.. 50 పైసలైనా వచ్చినయా.. కాంగ్రెస్ వచ్చాక పొంగులేటికి కాంట్రాక్టులు వచ్చాయి.. ఆయన ఇంట్లో డబ్బు కట్టలు దొరికినా ED ఎందుకు మాట్లాడట్లేదు’ అని KTR విమర్శించారు.