
ఉభయ కొరియాల మధ్య మరోసారి కయ్యం స్టార్ట్ అయింది. ఉత్తర కొరియా(north korea) అణుదాడికి పాల్పడితే ఆ దేశ ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్(kim jong un) పాలన అంతమైనట్లేనని దక్షిణ కొరియా(south korea) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉత్తర కొరియా ఈ మధ్యకాలంలో క్షిపణి ప్రయోగం నిర్వహించింది. దీంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు భావించడంతో అణు క్షిపణులు ప్రయోగించగలిగే అమెరికా జలాంతర్గామి.. దక్షిణ కొరియాకు అండగా ఉండేందుకు కొరియా ద్వీపకల్వానికి వచ్చింది. దీనిపై కిమ్ తీవ్రంగా స్పందించి ఇది అణు దాడికి దారితీయవచ్చని బెదిరించారు. అదే జరిగితే కిమ్ పాలన అంతమవుతుందని సౌత్ కొరియా స్పష్టం చేసింది.
అమెరికా జలాంతర్గామి రావడంతో ఉత్తర కొరియా దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. కొరియా ద్వీపకల్పపు పశ్చిమాన సముద్రం వైపు శనివారం క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది.