దేశానికి అత్యంత గర్వకారణమైన ఆపరేషన్ సిందూర్ కు ప్రపంచమే సాక్ష్యం(Witness)గా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఆయన మాట్లాడారు. భారత మిలిటరీ చేపట్టిన ఈ ఆపరేషన్ తో.. దేశ బలం, వ్యూహాత్మక(Strategic) సామర్థ్యం బయటకు తెలిశాయన్నారు. శాంతిని కాపాడుకుంటూనే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఆ దాడి ద్వారా ప్రపంచం గుర్తించిందన్నారు. ఆగస్టు 21 వరకు 32 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. మధ్యలో 12 నుంచి 18 తేదీ వరకు విరామం ఉంటుంది. ఇన్ కం టాక్స్ సహా వివిధ బిల్లుల్ని ప్రవేశపెడతారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com