
ఓవైపు రియలిస్టిక్ సినిమాల జోరు నడుస్తుంటే మరోవైపు ఫాంటసీ మూవీలు ఎక్కువగా రెడీ అవుతున్నాయి. భారీ బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా మూవీస్ తోపాటు చిన్న బడ్జెట్ చిత్రాలు సైతం ఒక రేంజ్ లో వసూలు చేస్తున్నాయి. ఈ ఫాంటసీ మూవీలను ఎక్కువ మంది టాప్ హీరోలే చూజ్(choose) చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత చిత్రసీమతోపాటు ప్రేక్షకుల అభిరుచిలో కూడా మార్పు వచ్చింది. అంతా కొత్తదనాన్ని అందులో విజువల్స్ వండర్ ఉండేలా కోరుకుంటున్నట్లు కనపడుతోంది. ఇంట్రస్టింగ్ ఐడియాలతో వస్తున్న చిన్న సినిమాలు సైతం ఫాంటసీ వరల్డ్ దిశగా తీసుకుపోతున్నాయి.

కల్కి 2892 AD’ టీజర్ తో హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ చూపిస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూవీని తీస్తున్నారు. ఇండియన్ స్క్రీన్స్ పై గతంలో చూడని రీతిలో డిఫరెంట్ మూవీని రెడీ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ‘కల్కి 2892 AD’ తెరకెక్కుతోంది. కృష్ణుడి నేపథ్యంగా వచ్చిన కార్తికేయ, కార్తికేయ-2 నిఖిల్ కెరీర్ లో ద బెస్ట్ గా నిలిచిపోయాయి. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నారు నిఖిల్. ఇక బింబిసార సినిమాతో టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్ సైతం మంచి మార్కులే దక్కించుకున్నాడు. హనుమాన్ కథతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆడియన్స్ ను అలరించేందుకు సినిమా రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే జాంబి కాన్సెప్ట్ తో వచ్చిన ఆయన తాజాగా హనుమాన్ కథతో అలరించబోతున్నాడు.

సౌత్ మూవీలే కాకుండా బాలీవుడ్ లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. బాలీవుడ్ మూవీ బ్రహ్మస్త్ర సైతం ఇదే కోవలో ఉండనుంది. పురాణాలు, దివ్యశక్తుల వంటి వాటిని బ్రహ్మాస్త్రలో చూపిస్తున్నారు.