కలెక్టర్లు క్షేత్రస్థాయి(Ground Level) పర్యటనలకు వెళ్లాల్సిందేనని CM రేవంత్ ఆదేశించారు. ఒక్కో IASకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారని, రోజూ ఏం చేస్తున్నారో దానిపై మరుసటిరోజే రిపోర్ట్ ఇవ్వాలని CMOకు ఆదేశాలిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు చేసేందుకు కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా ఆసుపత్రులపై దృష్టిసారించాలన్నారు. సబ్సిడీ యూరియా తెలంగాణలో 20 నుంచి 30 శాతం దారి మళ్లుతోందని కేంద్రమంత్రి తనకు స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. దీనిపై తనిఖీలు చేసి అక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.