ప్రముఖ కవి, కాలమిస్ట్ అన్నవరం దేవేందర్(Devender)ను దాశరథి కృష్ణమాచార్య పురస్కారం(Award) వరించింది. సాహిత్యరంగంలో కృషి చేసిన వారికి అవార్డు ఇస్తారు. దాశరథి జయంతి(జులై 22) సందర్భంగా ఏటా బహుమతి అందిస్తారు. కవిత్వం, వ్యాస సంపుటాల రచనల్లో దేవేందర్ సిద్ధహస్తులు. ‘తొవ్వ’ అనే సంపుటితో మొదలైన ప్రయాణం.. ‘నడక’, ‘పొద్దు పొడుపు’ సహా పలు రచనల వరకు సాగింది. అవార్డుతోపాటు 1,01,116 నగదు, జ్ఞాపిక అందజేస్తారు. 2023లో ఆయాచితం నటేశ్వరశర్మ, 2024లో జూకంటి జగన్నాథం అవార్డు గెలుచుకున్నారు.