ఏం కావాలనుందని అడిగితే బతకాలని ఉందని చెప్పే ధైర్యం చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. అన్నయ్య కొడతాడన్న భయంతోనే ఆ మాట చెప్పలేదని గుర్తు చేసుకున్నారు. ‘హరిహరి వీరమల్లు’ ప్రి గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ(AU) కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. యుక్త వయసులో ఏం చేయాలో తెలిసేది కాదని, 16 ఏళ్లొచ్చినా అమ్మాయిలా ఇంట్లో ఉండేవాడినన్నారు. అందుకే అన్న చిరంజీవి.. తనను సత్యానంద్(Satyanand) చేతుల్లో పెట్టారని తెలిపారు. సత్యానంద్ వద్ద నేర్చుకున్నది నటన కాదని, ధైర్యం, జీవిత పాఠాలని పాత రోజుల్ని మననం చేసుకున్నారు.