సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అన్ని రకాల వసతి గృహాల్లో డైట్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాలకు ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. వివిధ శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లకు ఈ పెంపు వర్తించనుంది. 3 నుంచి 7వ తరగతి స్టూడెంట్స్ కు ఇక నుంచి ఇచ్చేది నెలకు రూ.1200గా ఉంటుంది. ఇప్పటివరకు రూ.950గా ఉన్న ఛార్జీల్ని మరో రూ.250 పెంచుతూ మొత్తంగా రూ.1200 అందించనున్నట్లు తెలిపింది.
ఇంటర్ నుంచి PG వరకు రూ.1875కు పెంచుతూ నిర్ణయించింది. ఇప్పటిదాకా రూ.1500గా ఉన్న ఈ ఛార్జీల్ని రూ.1875కు పెంచింది. ఈ లెక్కన ఒక్కొక్కరికి రూ.375 అదనంగా చెల్లిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లయింది.