భారత ఆర్మీ విజయగాథకు చిహ్నమైన ‘ఆపరేషన్ సిందూర్’పై NCERT కీలక నిర్ణయం తీసుకున్నట్లే ఉంది. పాఠ్యపుస్తకాల్లో భాగం కాని ప్రత్యేక ప్రచురణల ద్వారా పిల్లలకు పరిచయం చేయబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచనప్రాయంగా అంగీకరించారు. 3-8 తరగతులకు ఒకటి, 9-12 క్లాసులకు మరోటి చొప్పున ఒక్కోటి 10 పేజీలుగా మాడ్యూల్ ఉండబోతోంది. భారత సైనిక శక్తి, పాకిస్థాన్ ఓటమి గురించి అవగాహన కల్పించడమే అసలు ఉద్దేశం. కొవిడ్-19, భారత్ డిజిటల్ శక్తి, చంద్రయాన్-3 మిషన్, G-20 శిఖరాగ్ర సదస్సుపై గతంలో మాడ్యూళ్లు వచ్చాయి. https://justpostnews.com