ఈ జోడీ ఔటైతే ఇక అంతే సంగతులు.. నెక్ట్స్ ఆడే వారెవరూ లేరు.. ఇలాంటి పరిస్థితుల్లో అద్భుతమే చేశారు జడేజా, సుందర్. ఇద్దరూ పోటాపోటీ సెంచరీలతో ఓటమి అంచుల్లో ఉన్న టీంను ఒడ్డున చేర్చారు. జైస్వాల్(0), రాహుల్(90), సుదర్శన్(0), గిల్(103) ఔటయ్యాక ఇక పంత్ బ్యాటింగ్ కు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ జోడీనే అత్యంత కీలకం. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ ఇద్దరూ జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఎంత ఓపికగా బ్యాటింగ్ చేశారంటే.. ఇంగ్లండ్ బౌలర్లందరినీ చికాకు పెట్టేలా. 311 పరుగులు వెనుకబడ్డ జట్టును దాన్ని దాటి మరో 100కు పైగా ఆధిక్యాన్ని అందించి అహో అనిపించారు. ఈ ఇద్దరి ఆటతీరు చూశాక ఆహా.. ఇంకో రోజు మిగిలి ఉంటే బాగుండు అని అనిపించింది. సుందర్ సెంచరీ కాగానే మ్యాచ్ డ్రాగా ముగించారు.