మతం పేరు అడిగి మరీ మారణహోమం సాగించిన పహల్గామ్ దాడి ఉగ్రవాది కోసం పెద్ద స్కెచ్ వేశారు. లష్కరే తొయిబా టెర్రరిస్ట్ సులేమాన్ సాహా హతం వెనుక పక్కా ప్లాన్ ఉంది. పాక్ ఆర్మీలో పనిచేసిన అతడు.. శ్రీనగర్ దచిగాం ఫారెస్టులో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నిర్ధారణ కోసం ఎలక్ట్రానిక్ డివైజెస్ తోపాటు సైనికుల్ని మోహరించారు. ఏదో అనుమానాస్పద కమ్యూనికేషన్ ఉందని, అది చైనీస్ అల్ట్రా రేడియో ద్వారానే జరుగుతున్నట్లు గుర్తించారు. ఆ తరంగాల్ని ఎన్ క్రిప్ట్ చేయడం మొదలుపెట్టారు. అందులో వారి లక్ష్యాలేంటో స్పష్టం కాగా.. ఈసారి విదేశీయులే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇలా 14 రోజుల పక్కా స్కెచ్ తో ‘ఆపరేషన్ మహదేవ్’ అమలు చేశారు. ముగ్గుర్ని మట్టుబెట్టాక AK-47 గన్స్, 17 గ్రనేడ్స్ తోపాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.