దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul) గాంధీ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ లోపాలను మహారాష్ట్ర ఎలక్షన్లలో గుర్తించామన్నారు. దీన్ని నిరూపించేందుకు ఆరు నెలలు కష్టపడ్డామన్నారు. 6.5 లక్షల మంది ఓట్లు వేస్తే అందులో లక్షన్నర ఓట్లు నకిలీవన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటూ రాకపోవడం ఆశ్చర్యకరమన్నారు. 4 నెలల వ్యవధిలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగాయని, MP సీట్లు బాగా గెలిస్తే అసెంబ్లీకి ఎలా ఓడిపోతామని ప్రశ్నించారు.