ఇంగ్లండ్ తో ఐదో టెస్టులో భారత బ్యాటింగ్ నిలకడగా కొనసాగడంతో మంచి ఆధిక్యం(Lead) లభించింది. జైస్వాల్(118) సెంచరీ, ఆకాశ్ దీప్(66), జడేజా(53), సుందర్(53) హాఫ్ సెంచరీలతో 373 పరుగుల లీడ్ దక్కింది. రాహుల్(7), సుదర్శన్(11), గిల్(11), కరుణ్(17) పెద్దగా ఆడకున్నా.. జైస్వాల్, ఆకాశ్, జడేజా, సుందర్, జురెల్ నిలబడ్డారు. తొలి ఇన్నింగ్స్ లో టీమ్ఇండియా 224కు, ఇంగ్లండ్ 247కు ఆలౌట్ అయ్యాయి. 23 పరుగుల ఆధిక్యాన్ని అప్పగించి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన.. దీటుగా బ్యాటింగ్ చేసి చివరకు 396కు ఆలౌటైంది.