భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ మాటలు శుద్ధ అబద్ధమని అమెరికన్ AI ప్లాట్ ఫాంలు తేల్చిచెప్పాయి. భారత ఆర్థిక వ్యవస్థ(Economic System)కు కాలం చెల్లిందా అని అమెరికాకు చెందిన 5 ప్రధాన ప్లాట్ ఫాంలు చాట్ జీపీటీ, గ్రోక్(Grok), జెమిని, మెటా AI, కోపైలట్(Copilot)కు ప్రశ్న వేశారు. వాటి జవాబులు అమెరికా అధ్యక్షుడికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
చాట్ GPT…: భారత ఆర్థిక వ్యవస్థ అంతం కాలేదు.. ఇది డైనమిక్.. ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది.
గ్రోక్…: భారత ఆర్థిక వ్యవస్థకు ఏం కాలేదు.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి.
జెమిని…: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి ద్వారా సాగుతోంది.
మెటా AI…: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు.. ఇది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.
కోపైలట్…: ట్రంప్ చెప్పిన మాట ఏ మాత్రం దగ్గరగా లేదు.. నిజానికి ఇది చాలా వ్యతిరేకం.