వేతనాలు పెంచాలంటూ తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood) ఎంప్లాయీస్ యూనియన్.. రేపట్నుంచి షూటింగ్ లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 30% వేతనాలు పెంచాలని, నిర్మాత నుంచి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన తర్వాతే షూటింగ్ చేయాలన్న డిమాండ్ పెట్టింది. సంబంధిత లెటర్ ను ఆమోదించిన తర్వాత విధులకు వెళ్లాలని నిర్ణయించింది. అప్పటివరకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులెవరూ చిత్రీకరణలకు వెళ్లొద్దని అల్టిమేటం జారీచేసింది. ఇది తెలుగుతోపాటు అన్ని భాషల చిత్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.