ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్(Shibu Soren) కన్నుమూశారు. 81 ఏళ్ల వయసు గల ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో మృతిచెందారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2004లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) పార్టీ ఏర్పాటు చేశారు. 3 పర్యాయాలు CMగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత CM హేమంత్ సోరెన్ ఆయన కుమారుడే. మన్మోహన్ ప్రభుత్వంలో బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు. 11 మంది ప్రాణాలు కోల్పోయిన చిరుధి ఘటనలో అరెస్టు వారెంట్ జారీ కావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. డుమ్కా(Dumka) లోక్ సభ స్థానం నుంచి 6 సార్లు MPగా ఎన్నికయ్యారు.