కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ చేసిన ఆరోపణలపై మందలించింది. 2020 జూన్‌లో లద్దాఖ్ గల్వాన్ లోయలో హింస జరిగి 20 మంది సైనికులు మరణించిన ఘటనపై రాహుల్ కామెంట్స్ చేశారు. ‘2 వేల కి.మీ. భారత భూమిని చైనీయులు స్వాధీనం చేసుకున్నారని మీకెలా తెలిసింది.. మీరు అక్కడ ఉన్నారా.. మీ దగ్గర ఏదైనా విశ్వసనీయ ఆధారాలున్నాయా.. నిజమైన భారతీయులైతే ఇవన్నీ మాట్లాడరు..’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ప్రశ్నించింది. సైన్యాన్ని కించపరిచే ప్రకటనలు సరికాదంటూ లఖ్‌నవూలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన సమన్లను రాహుల్ సుప్రీంలో సవాల్ చేశారు. క్రిమినల్ పరువు నష్టం కేసులో విచారణను నిలిపివేసినప్పటికీ రాహుల్ ను తీవ్రంగా మందలించింది.