సుంకాలతో భారత్ ను భయపెట్టాలనుకున్న ట్రంప్ కు సీన్ రివర్సయింది. రష్యా(Russia)తో సంబంధాల్ని తట్టుకోలేక టారిఫ్స్ మరింత పెంచుతానని వార్నింగ్ ఇచ్చారు. కానీ భారత్ వేసిన ప్రశ్నకు గిలగిలా కొట్టుకుంటున్నారు. రష్యా నుంచి యురేనియం, ఫర్టిలైజర్ ను ఇప్పటికీ అమెరికా కొంటున్నదని, దానిపైనా టారిఫ్స్ వేస్తారా అంటూ మోదీ సర్కారు ప్రశ్నించింది. ‘ఆ విషయం నాకు తెలియదు.. దాని గురించి కనుక్కుంటా..’ అంటూ ట్రంప్ తెల్లముఖం వేశారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి మూడేళ్లవుతున్నా.. 2022 జనవరి నుంచి ఇప్పటిదాకా రష్యా నుంచి 24.51 బి.డా. విలువైన యురేనియం, వస్తువులు కొనుగోలు చేసింది. తనను బెదిరించాలని చూసిన అమెరికానే ఇరుకునపెట్టింది భారత్.