
CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు. జమ్ముకశ్మీర్ బసంత్ గర్ వద్ద ఆపరేషన్ ముగించి 23 మంది వాహనంలో వెళ్తున్నారు. 187 బెటాలియన్ ఫోర్స్ ఉధంపూర్(Udhampur) సమీపంలోని నల్లా(Nallah) వద్ద ప్రమాదానికి గురైంది. గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం వ్యక్తం చేశారు.