ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థులను కొంతమంది మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని TGSRTC ఎం.డి. సజ్జనార్ అన్నారు. ఇలాంటి వాటిని నమ్మొద్దంటూ.. 3,038 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. ప్రభుత్వ నియామక బోర్డు(Recruitment Board) ద్వారా త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందన్నారు. నియామక ప్రక్రియ పూర్తి మెరిట్ ఆధారంగా పారదర్శకంగా ఉంటుందని ట్వీట్ చేశారు. RTCలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.