
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పోరాటం చేస్తోంది. తొలి టెస్టు మాదిరిగా తడబాటు లేకుండా జాగ్రత్తగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్లకు 229 రన్స్ చేసింది. జేసన్ హోల్టర్(11), అథనేజ్(37) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ కు వర్షం పలుసార్లు అంతరాయం కలిగించింది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ఇంకా 209 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్ వైట్(75) రాణించగా.. చందర్ పాల్(33), మెకంజీ(32), బ్లాక్ వుడ్(20) పరుగులు చేశారు. జడేజా 2, సిరాజ్, అశ్విన్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.
86/1తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ తొలుత నిలకడగా బ్యాటింగ్ కొనసాగించింది. మెకంజీని ముకేశ్ ఔట్ చేసిన కొద్దిసేపటికే వాన మొదలైంది. వర్షం కారణంగా తొలి సెషన్ లో 10.4 ఓవర్ల ఆటే సాధ్యమైంది.