ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తానే బయటపెట్టానని కేంద్ర మంత్రి బండి సంజయ్(Sanjay) అన్నారు. అందరికన్నా ఎక్కువగా ట్యాప్(Tapping) అయింది తన ఫోనేనని, కుటుంబ సభ్యులతోపాటు చుట్టూ ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్నారన్నారు. సిట్ ఎదుట హాజరవుతానని, కానీ రేవంత్ సర్కారు వల్ల ఈ విచారణ నామమాత్రమేనన్నారు. సిట్ కు బదులు CBI విచారణ జరిపిస్తేనే KCR ప్రభుత్వ బండారం బయటపడుతుందన్నారు. విచారణకు బయల్దేరేముందు ఆయన ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.