ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు ఇప్పటికే ఇద్దరు నటులు హాజరు కాగా.. ఈరోజు మరొకరు వచ్చారు. బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేసిన దగ్గుబాటి రానా మొన్న వాయిదా వేసుకోగా.. ఈరోజు అటెండయ్యారు. ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ విచారణ మొన్ననే పూర్తి కాగా… ఈరోజు రానా వంతు. ఇక మంచు లక్ష్మీ సైతం ఈనెల 13న ED ముందుకు రానున్నారు. ఇప్పటికే నటులందరి లావాదేవీల్ని సేకరించిన అధికారులు.. వాటి గురించి ప్రశ్నిస్తున్నారు. యాప్ నిర్వాహకుల నుంచి నిధులు ఎలా వచ్చాయి.. ఎంతెంత చెల్లించారనేది తెలుసుకుంటున్నారు.