వీధికుక్కల(Stray Dogs)తో కలిగే రేబిస్ మరణాలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీ NCR పరిధి నివాస ప్రాంతాల నుంచి వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. కేంద్రం వాదన మాత్రమే వింటామని సుమోటోగా కేసు స్వీకరించిన జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ బెంచ్ స్పష్టం చేసింది. ‘డాగ్ లవర్స్’ నుంచి ఏ పిటిషన్లూ స్వీకరించబోమని, తరలింపును అడ్డుకుంటే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. ‘ఈ పని మా కోసం కాదు ప్రజల కోసమే.. ఎలాంటి మనోభావాలు ఇందులో ఉండొద్దు.. మృతుల్ని జంతు ప్రేమికులు తిరిగి తీసుకురాగలరా.. ఇక నియమాల్ని మరచిపోండి..’ అని ఘాటుగా మాట్లాడింది. జంతు ప్రేమికుడు గతంలో ఢిల్లీ హైకోర్టు నుంచి స్టే తెచ్చారన్న విషయాన్ని SG తుషార్ మెహతా కోర్టుకు తెలపడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసింది. NCR పరిధిలో ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాలున్నాయి.