శ్రీశైలం(Srisailam) సమీపంలోని దోర్నాల వద్ద నల్లమల ఘాట్ రోడ్డులో రెండు బస్సులు ఢీకొన్నాయి. బస్సుల ముందు భాగాలు దెబ్బతినడంతో ఒక డ్రైవర్ కాలు అందులోనే ఇరుక్కుపోయింది. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో వందలాదిగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇరు బస్సుల్లోని ప్రయాణికులు(Passengers) కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీశైలం వైపు నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు దోర్నాల వైపునకు వాహనాలు రాకుండా ఆపేశారు. క్రేన్ సహాయంతో బస్సుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.