హైదరాబాద్(Hyderabad) జంట నగరాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయి వర్షపాతం లేకున్నా.. రాజధానిలో మాత్రం వారం రోజులుగా పడుతున్నాయి. ఈరోజు సికింద్రాబాద్, హయత్ నగర్, కూకట్ పల్లి సహా ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో జోరుగా వాన కురిసింది. కొన్ని గంటల్లో 5 జిల్లాల్లోనూ భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ(Hanmakonda) జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశాలున్నాయి.