పదోతరగతి(Tenth Class) పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను పాత పద్ధతిలోనే పరీక్షలు జరపాలని నిర్ణయించింది. 80% ఎక్స్టర్నల్(External), 20 శాతం ఇంటర్నల్ మార్కులుంటాయని ప్రకటించింది. ఈ మేరకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్(HOD)లు, RJDSE హైదరాబాద్, వరంగల్ సహా జిల్లాల విద్యాధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. https://justpostnews.com