తెలంగాణ(Telangana) హైకోర్టు న్యాయమూర్తి విషయంలో సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. జస్టిస్ మౌషుమి(Moushumi) భట్టాచార్య బదిలీకి అసభ్య, అవమానకర రీతిలో పిటిషన్ వేసిన న్యాయవాదులు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. వారంలోపు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ CJI బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎ.ఎస్.చందూకర్ ధర్మాసనం స్పష్టం చేసింది. దీని అంగీకారానికి వారం వ్యవధి కేటాయిస్తూనే.. పరిశీలించాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు ఆదేశాలిచ్చింది. హైకోర్టు జడ్జిలు సుప్రీం న్యాయమూర్తులతో సమానులని.. హైకోర్టు, ట్రయల్ కోర్టు జడ్జిల్ని విమర్శించేవారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదని వార్నింగ్ ఇచ్చింది. సుప్రీం జడ్జిల కన్నా తాము తక్కువని హైకోర్టు న్యాయాధికారులు అనుకోవద్దని.. వారి తీర్పుల్ని మార్చడం, తిప్పి పంపడం పరిపాలనాపరమైన చర్యలో భాగమేనని క్లారిటీ ఇచ్చింది.