రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని(Continue) వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ లో మూసీ ఉప్పొంగి వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో చాలాచోట్ల ట్రాఫిక్ మళ్లించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 21.8 సెం.మీ. నమోదైంది. నిన్న పొద్దున 8:30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు ఈ స్థాయిలో వర్షపాతం రికార్డయింది.
అత్యధిక వర్షపాత(సెంటీమీటర్ల) వివరాలిలా… https://justpostnews.com
జిల్లా | మండలం | ప్రాంతం | సెంటీమీటర్లు |
వరంగల్ | సంగెం | కాపులకనపర్తి | 21.8 |
సూర్యాపేట | నాగారం | నాగారం | 19 |
వరంగల్ | సంగెం | సంగెం | 18.7 |
సూర్యాపేట | నాగారం | ఫణిగిరి | 18.2 |
వరంగల్ | ఖిల్లావరంగల్ | ఉరుస్ | 14.8 |
సూర్యాపేట | తుంగతుర్తి | తుంగతుర్తి | 13.5 |